Header Banner

వారెవ్వా.. 43 ఏళ్ల వ‌య‌సులోనూ మెరుపు ఫీల్డింగ్‌.. 4 ర‌న్స్ తేడాతో మట్టిక‌రిపించిన ఇండియా!

  Sun Feb 23, 2025 11:05        Sports

ఇంట‌ర్నేష‌న‌ల్ మాస్ట‌ర్స్ లీగ్‌లో టీమిండియా మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ స్ట‌న్నింగ్ క్యాచ్‌తో అల‌రించాడు. ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్‌లో శ్రీలంక మాస్ట‌ర్స్ జ‌ట్టు ఆట‌గాడు లహిరు తిరిమన్నే కొట్టిన బంతిని బౌండ‌రీ లైన్ వ‌ద్ద గాల్లోకి ఎగిరి ఒడిసిప‌ట్టుకున్నాడు. 43 ఏళ్ల వ‌య‌సులోనూ అప్ప‌టి యువ‌రాజ్‌ను గుర్తు చేశాడు. దీంతో యువీ క్యాచ్ వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటు బ్యాటింగ్‌లోనూ అద‌ర‌గొట్టిన యువీ 22 బంతుల్లో 2 సిక్స‌ర్లు, 2 బౌండ‌రీల‌తో అజేయంగా 31 ప‌రుగులు బాదాడు. అత‌నితో పాటు గుకీరత్ సింగ్ (44), స్టూవర్ట్ బిన్నీ (68), యూసుఫ్ పఠాన్ (56 నాటౌట్) రాణించ‌డంతో ఇండియా మాస్ట‌ర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 222/4 పరుగులు చేసింది. అనంత‌రం 223 ప‌రుగుల ల‌క్ష్య‌ ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన శ్రీలంక మాస్ట‌ర్స్ 218 ర‌న్స్ చేసింది. దీంతో నాలుగు ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యం పాలైంది. ఆ జ‌ట్టులో కుమార్ సంగక్కర 51 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇర్ఫాన్ పఠాన్ మూడు వికెట్లు తీసి ఇండియా మాస్ట‌ర్స్  విజ‌యంలో కీరోల్ పోషించాడు. 

 

ఇది కూడా చదవండి: తల్లికి వందనం పథకంపై అపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్! డేట్ ఫిక్స్! ఈ నెలలో...

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #YuvrajSingh #MastersLeague #IndiaMasters #SriLankaMasters #Cricket #SportsNews